‘అజ్ఞాతవాసి’ ట్రైలర్ రిలీజ్ డేట్ | Pawan Kalyan Agnyaathavaasi Trailer Release Date | Sakshi
Sakshi News home page

Dec 21 2017 1:46 PM | Updated on Mar 22 2019 5:33 PM

Pawan Kalyan Agnyaathavaasi Trailer Release Date - Sakshi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం అజ్ఞాతవాసి. జల్సా, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. తొలిసారిగా అనిరుధ్ స్వరాలందించిన ఆడియోను ఇటీవల అభిమానుల సమక్షంలో ఘనంగా విడువల చేశారు.

అయితే ఆడియో రిలీజ్ రోజే  ట్రైలర్ ను కూడా రిలీజ్ చేస్తారని భావించినా.. అలా చేయలేదు. సినిమా రిలీజ్ కు మరికొద్ది రోజులు టైం ఉండటంతో ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేశారు. ఫైనల్ గా ట్రైలర్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. అభిమానులకు న్యూ ఇయర్ వేడుకలు కాస్త ముందుగానే తీసుకువచ్చేందుకు డిసెంబర్ 26న ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జనవరి 10న రిలీజ్ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement