ఒక్క పాట.. 20 రోజులు | Padmavati : Aishwarya Rai to give special appearance in a song | Sakshi
Sakshi News home page

ఒక్క పాట.. 20 రోజులు

Dec 12 2016 11:38 PM | Updated on Sep 4 2017 10:33 PM

ఒక్క పాట.. 20 రోజులు

ఒక్క పాట.. 20 రోజులు

మన సెట్‌లోకి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ రానున్నారోచ్‌!’ అంటూ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ బృందంలో సభ్యులు యమా సంతోషంగా ఉన్నారు.

‘మన సెట్‌లోకి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ రానున్నారోచ్‌!’ అంటూ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ బృందంలో సభ్యులు యమా సంతోషంగా ఉన్నారు. సెట్స్‌కి ఆమె వస్తే అంత సంతోషం ఎందుకు అనుకుంటున్నారా? ఆమె చుట్టపు చూపుగా సెట్‌కి వెళ్లడం లేదు. షాహిద్‌ కపూర్, రణవీర్‌ సింగ్, దీపికా పదుకొనే ముఖ్య తారలుగా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘పద్మావతి’లో ఐశ్వర్య స్పెషల్‌ సాంగ్‌ చేయనున్నారట! ఇటీవల దర్శకుడు ఐశ్వర్యను కలసి సాంగ్‌ కాన్సెప్ట్‌ చెప్పగా, ఆమె హ్యాపీగా యాక్సెప్ట్‌ చేశారట! ఈ ఒక్క పాట రిహార్సల్స్, షూటింగ్‌.. అన్నిటికీ భన్సాలీ 20 రోజుల కాల్షీట్స్‌ అడిగారని సమాచారం.

అంతే మరి, ఈ దర్శకుడు తన సినిమాల్లో పాటలన్నిటినీ భారీగానే చిత్రీకరిస్తారు. ‘దేవదాస్‌’లోని ‘డోలారే డోలారే..’ అయినా, తాజా ‘బాజీరావ్‌ మస్తానీ’లో ‘పింగా గ పోరి పింగా..’ అయినా కన్నుల పండువగా ఉంటాయి. ఇప్పుడీ ‘పద్మావతి’ లోనూ ఐశ్వర్యారాయ్‌ ప్రత్యేక గీతం భారీ స్థాయిలో ఉంటుందట. ‘మునుపెన్న డూ భారతీయ తెరపై చూడని రీతిలో భన్సాలీ ఈ పాటను తీయను న్నారు’ అని చిత్ర బృందం పేర్కొంది. గతంలో భన్సాలీ దర్శకత్వం వహించిన ‘దేవదాస్‌’, ‘గుజారిష్‌’ చిత్రాలలానే ఈ ‘పద్మావతి’ కూడా ఐశ్వర్యకు మంచి పేరు తెచ్చేలా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement