త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చిత్రం? | NTR next film in Trivikram's direction? | Sakshi
Sakshi News home page

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చిత్రం?

Sep 15 2016 3:47 PM | Updated on Sep 4 2017 1:37 PM

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో జూ.ఎన్‌టీఆర్ హీరోగా ఓ చిత్రం త్వరలో తెరకెక్కనుందట.

హైదరాబాద్ : త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో జూ.ఎన్‌టీఆర్ హీరోగా ఓ చిత్రం త్వరలో తెరకెక్కనుందట. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సినిమా చేసే విషయమై ఎన్‌టీఆర్ త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' ప్రస్తుతం మంచి కలెక్షన్లతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.

దసరా నాటికి పూరీ జగన్నాధ్ దర్శకుడుగా తన సోదరుడు కల్యాణ్ రాం నిర్మాతగా ఓ చిత్రంలో నటించేందుకు తారక్ సిద్ధమయ్యారు. ఆ చిత్రం షూటింగ్ ప్రారంభమైన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఎన్‌టీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి చర్చలు కూడా పూర్తయ్యాయని, ఇక అధికారికంగా ప్రకటించటమే మిగిలి ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement