రాఘవేంద్రుడితో ఎన్టీఆర్..? | NTR joining hands with Raghavendra Rao | Sakshi
Sakshi News home page

రాఘవేంద్రుడితో ఎన్టీఆర్..?

Oct 8 2016 11:03 AM | Updated on Sep 4 2017 4:40 PM

రాఘవేంద్రుడితో ఎన్టీఆర్..?

రాఘవేంద్రుడితో ఎన్టీఆర్..?

జనతా గ్యారేజ్ సినిమాతో తన కెరీర్లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన ఎన్టీఆర్, ఇంత వరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను ఎనౌన్స్ చేయలేదు. వక్కంత వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ చాలా రోజులుగా టాక్ వినిపిస్తున్నా...

జనతా గ్యారేజ్ సినిమాతో తన కెరీర్లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన ఎన్టీఆర్, ఇంత వరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను ఎనౌన్స్ చేయలేదు. వక్కంత వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ చాలా రోజులుగా టాక్ వినిపిస్తున్నా.. ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశాడట. ఆ తరువాత పూరి దర్శకత్వంలో మరోసారి ఎన్టీఆర్ సినిమా ఉంటుందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.

అయితే తాజాగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోందన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం నాగార్జున హీరోగా ఓం నమోవేంకటేశాయ సినిమాను రూపొందిస్తున్న దర్శకేంద్రుడు రాబోయే రెండేళ్లలో ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోయే సినిమా పౌరాణికం లేదా సోషియో ఫాంటసీ అయ్యే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు బాహుబలి తరహాలో ఈ సినిమాను కూడా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్తో ప్రతిష్టాతక్మంగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement