ఆన్లైన్లో జనతా గ్యారేజ్ హవా | Ntr Janatha Garage Creating New Records on YouTube | Sakshi
Sakshi News home page

ఆన్లైన్లో జనతా గ్యారేజ్ హవా

Aug 14 2016 10:14 AM | Updated on Sep 4 2017 9:17 AM

ఆన్లైన్లో జనతా గ్యారేజ్ హవా

ఆన్లైన్లో జనతా గ్యారేజ్ హవా

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్ హవా మొదలైంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ తోనే యూట్యూబ్ సెన్సేషన్ గా నిలిచిన జనతా గ్యారేజ్. ఇప్పుడు థియట్రికల్ ట్రైలర్ తోనూ అదే జోరు...

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్ హవా మొదలైంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ తోనే యూట్యూబ్ సెన్సేషన్ గా నిలిచిన జనతా గ్యారేజ్. ఇప్పుడు థియట్రికల్ ట్రైలర్ తోనూ అదే జోరు చూపిస్తోంది. సినిమా కంటెంట్ ను రివీల్ చేస్తూ రూపొందించిన ఈ ట్రైలర్ యూట్యూబ్ వ్యూస్ లో దూసుకుపోతోంది.

ఆడియోతో పాటు రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ ట్రైలర్ కు కేవలం 24 గంటల్లోనే 20 లక్షలకు పైగా వ్యూస్తో పాటు 34 వేలకు పైగా లైక్స్ రావటంతో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ముందు ముందు ఆన్లైన్లో జనతా గ్యారేజ్ హవా మరింత భారీగా కనిపించనుందన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement