కొరటాలకు మరో కానుక | Ntr Costly gift to koratala siva | Sakshi
Sakshi News home page

కొరటాలకు మరో కానుక

Feb 27 2016 8:35 AM | Updated on Sep 3 2017 6:33 PM

కొరటాలకు మరో కానుక

కొరటాలకు మరో కానుక

చేసినవి రెండు సినిమాలే అయినా.. దర్శకుడిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు కొరటాల శివ. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన శివ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్

చేసినవి రెండు సినిమాలే అయినా.. దర్శకుడిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు కొరటాల శివ. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన శివ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈసినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడు సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాతో మహేష్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ ను అందించిన కొరటాలను భారీ గిఫ్ట్ తో సర్ప్రైజ్ చేశాడు సూపర్ స్టార్. 50 లక్షలు విలువ చేసే లగ్జరీ కారును కొరటాల శివకు గిఫ్ట్ గా ఇచ్చాడు మహేష్.

ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. మహేష్ సినిమా సక్సెస్ తరువాత గిఫ్ట్ ఇస్తే ఎన్టీఆర్ మాత్రం సినిమా మొదలవ్వగానే కొరటాలకు విలువైన కానుక ఇచ్చాడు. ఎన్టీఆర్ దాదాపు 20 లక్షల రూపాయల విలువ చేసే వాచ్ ని కొరటాలకు గిఫ్ట్ గా ఇచ్చాడన్నటాక్ వినిపిస్తోంది. సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే ఇంత భారీ కానుకను అందుకున్న కొరటాల.. మరి ఎన్టీఆర్ కెరీర్‌కు ఎలాంటి బ్రేక్ ఇస్తాడో చూడాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement