పవర్స్టార్ ఆడియో రిలీజ్కు ఎన్టీఆర్ చీఫ్గెస్ట్ | Ntr Chief guest for power star puneeth rajkumar audio | Sakshi
Sakshi News home page

పవర్స్టార్ ఆడియో రిలీజ్కు ఎన్టీఆర్ చీఫ్గెస్ట్

Jan 23 2016 1:33 PM | Updated on Jul 6 2019 4:09 PM

పవర్స్టార్ ఆడియో రిలీజ్కు ఎన్టీఆర్ చీఫ్గెస్ట్ - Sakshi

పవర్స్టార్ ఆడియో రిలీజ్కు ఎన్టీఆర్ చీఫ్గెస్ట్

పవర్ స్టార్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ఆడియో రిలీజ్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వనించారు. పవర్ స్టార్ అంటే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు. సాండల్ వుడ్...

పవర్ స్టార్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ఆడియో రిలీజ్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వనించారు. పవర్ స్టార్ అంటే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు. సాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. పునీత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్ టైనర్ చక్రవ్యూహ ఆడియో రిలీజ్కు జూనియర్ ఎన్టీఆర్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు చిత్రయూనిట్.

ఈ ఆడియోకు ఎన్టీఆర్ను ఆహ్వానించటం వెనుక మరోకారణం కూడా ఉంది. పునీత్ రాజ్ కుమార్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, ఓ పాట కూడా పాడాడు. ఇప్పటికే నాన్నకు ప్రేమతో సినిమాలో 'ఐ వన్నా ఫాలో ఫాలో' పాటతో టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టిస్తున్న జూనియర్, కన్నడ ఇండస్ట్రీలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అందులో భాగంగా ఫిబ్రవరి 12న రిలీజ్ అవుతున్న చక్రవ్యూహ ఆడియో రిలీజ్కు ముఖ్య అతిథిగా హజరవుతున్నాడు ఎన్టీఆర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement