మహానటిగా నిత్య మీనన్‌ | Nitya Menon To Play Savitri In Ntr Biopic | Sakshi
Sakshi News home page

Sep 22 2018 3:48 PM | Updated on Sep 22 2018 3:48 PM

Nitya Menon To Play Savitri In Ntr Biopic - Sakshi

అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కనిపించిన కీర్తి సురేష్ అద‍్భుతంగా నటించిందన్న ప్రశంసలు దక్కాయి. అయితే ముందుగా ఈ పాత్ర నిత్యమీనన్‌ దగ్గరకే వెళ్లిందట. కానీ అనివార్య కారణాల వల్ల నిత్య మహానటి సినిమాలో నటించలేకపోయింది. అయితే తాజాగా సావిత్రి పాత్ర మరోసారి నిత్యను వెతుక్కుంటూ వచ్చిందట.

నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా యన్‌.టి.ఆర్‌ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రకు నిత్యమీనన్‌ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. మాయబజార్‌, మిస్సమ్మ, రక్తసంబంధం లాంటి అద్భుత చిత్రాలకు సంబంధించిన సన్నివేశాలను యన్‌.టి.ఆర్‌లో చూపిస్తున్నారు. ఈ సీన్స్‌లో సావిత్రిగా నిత్య మీనన్‌ కనిపించనుంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. నిత్య మీనన్‌, సావిత్రి పాత్రలో కనిపించటం కన్ఫమ్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement