జెట్ స్పీడ్లో నిత్యామీనన్ | Nithya Menon in jet speed | Sakshi
Sakshi News home page

జెట్ స్పీడ్లో నిత్యామీనన్

Apr 29 2015 4:50 PM | Updated on Sep 3 2017 1:07 AM

నిత్యా మీనన్

నిత్యా మీనన్

నిన్న మొన్నటి వరకు స్లోగా ఉన్న నిత్యా మీనన్ కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. 2015లో జెట్ స్పీడ్లో దూసుకుపోతుంది.

ఏ నిముషానికి ఏమి జరుగునో.. అనే మాటలు చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి ఖచ్చితంగా సరిపోతాయి. ఎవరు ఎప్పుడు ఫాంలోకి వస్తారో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే సినిమాని రంగుల ప్రపంచం అంటారు. నిన్న మొన్నటి వరకు స్లోగా ఉన్న నిత్యా మీనన్ కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. 2015లో జెట్ స్పీడ్లో దూసుకుపోతుంది.

నిత్యా మీనన్   హీరోయిన్గా 'అలా మొదలైంది'  సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది . తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకున్న ఈ ముద్దుగుమ్మ  సెలక్టీవ్గా సినిమాలు చేడంతో  కాస్త తక్కువ గానే కనిపించింది. అయితే నితిన్తో నిత్య నటించిన ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే   సినిమాలు హిట్టుకావడంతో నిత్య మళ్లీ ఫామ్‌లోకి  వచ్చింది.  2015లో  నాలుగు నెల్లోనే నిత్య  నటించిన  ఐదు  సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. శర్వానంద్తో కలసి నిత్య నటించిన  మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు  మంచి విజయాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో పాత్ర ప్రాధాన్యత తెలుసుకొని  కాస్త  వయసు ఎక్కువగా కనిపించడానికి కూడా నిత్య ఏమాత్రం వెనుకాడలేదు  .

హీరోయిన్ క్యారెక్టర్సే కావలని పట్టుబట్టనని  నిత్య స్వయంగా చెప్పింది. బన్నీతో కలసి  S/O సత్యమూర్తిలో  ఓ కీలక పాత్రలో  నటించిది. తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో  రూపొందిన  ఒకే కణ్మణి తెలుగులో ఒకే బంగారం పేరుతో విడుదలయ్యింది. ఎలాంటి భావోద్వేగాన్నైనా అలవోకగా పలికించగల  నిత్య   ఒకే బంగారం మూవీలో తన  నవ్వుతోనే ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. తమిళంలో   డ్యాన్స్‌మాస్టర్ రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో వచ్చిన కాంచన-2  గంగ చిత్రంలోనూ  నిత్య తనదైన శైలీలో నటనకు ప్రాధాన్యత వున్న  పాత్రలో  కనిపించింది. ఇక తన మాతృబాష మలయాలలోను మహామద్ దర్శకత్వంలో  100 డేస్ ఆఫ్ లవ్ అనే చిత్రంలో అలరించింది.


ఇలా నాలుగు నెలల్లోనే నిత్యా మీనన్ నటించి 5 సినిమాలు ప్రేక్షకులముందుకు వచ్చాయి. గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రూపిందిన  రుద్రమదేవి మూవీలోను నిత్య  ప్రధాన్యతగల పాత్రలో కనిపించనుంది. అలాగే బెంగూళుర్ డేస్ రీమేక్తోపాటు  తమిళ క్వీన్  రీమేక్తోను  అలరించనుంది. ఈ విధంగా ఈ ఏడాది  నిత్య మాంచి దూకుడు మీదవుందనే చెప్పాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement