నితిన్‌తో డాలీ? | nithin, kishore pardasani new movie | Sakshi
Sakshi News home page

నితిన్‌తో డాలీ?

May 27 2018 12:53 AM | Updated on May 27 2018 12:53 AM

nithin, kishore pardasani new movie - Sakshi

నితిన్

యంగ్‌ హీరో నితిన్‌తో కిశోర్‌ పార్థసాని(డాలీ) ఓ సినిమా తెరకెక్కించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ‘ఛల్‌ మోహన్‌రంగ’ చిత్రం తర్వాత నితిన్‌ ‘శతమానం భవతి’ ఫేమ్‌ సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రంలో నటిస్తున్నాడు. రాశీఖన్నా కథానాయిక. ‘దిల్‌’ రాజు నిర్మాత. ‘దిల్‌’ సినిమా విడుదలైన 14 ఏళ్ల తర్వాత నితిన్‌–‘దిల్‌’ రాజు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రమిది.

ఈ సినిమా పూర్తయ్యాక డాలీ దర్శకత్వంలో నితిన్‌ నటించనున్నట్లు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ‘కాటమరాయుడు’ చిత్రం తర్వాత నితిన్‌ కోసం డాలీ ఓ సరికొత్త కథని రెడీ చేశారట. ఇటీవల నితిన్‌ను కలిసి కథ వినిపించడం... ఆయనకు నచ్చడం జరిగిపోయాయట. దీంతో ప్రస్తుతం పూర్తి కథ రెడీ చేసే పనుల్లో ఉన్నారట డాలీ. ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రం తర్వాత డాలీ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారట నితిన్‌.

Advertisement
 
Advertisement
Advertisement