breaking news
Kishore Kumar Pardasani
-
నితిన్‌తో డాలీ?
యంగ్ హీరో నితిన్‌తో కిశోర్ పార్థసాని(డాలీ) ఓ సినిమా తెరకెక్కించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ‘ఛల్ మోహన్‌రంగ’ చిత్రం తర్వాత నితిన్ ‘శతమానం భవతి’ ఫేమ్ సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రంలో నటిస్తున్నాడు. రాశీఖన్నా కథానాయిక. ‘దిల్’ రాజు నిర్మాత. ‘దిల్’ సినిమా విడుదలైన 14 ఏళ్ల తర్వాత నితిన్–‘దిల్’ రాజు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమా పూర్తయ్యాక డాలీ దర్శకత్వంలో నితిన్ నటించనున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ‘కాటమరాయుడు’ చిత్రం తర్వాత నితిన్ కోసం డాలీ ఓ సరికొత్త కథని రెడీ చేశారట. ఇటీవల నితిన్‌ను కలిసి కథ వినిపించడం... ఆయనకు నచ్చడం జరిగిపోయాయట. దీంతో ప్రస్తుతం పూర్తి కథ రెడీ చేసే పనుల్లో ఉన్నారట డాలీ. ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రం తర్వాత డాలీ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారట నితిన్. -
గోపాల... గోపాల ఓ ప్రయోగం
తెలుగు తెరపై మల్టీస్టారర్ల హవా ఊపందుకుంది. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎవడు, మనం’ చిత్రాల తర్వాత మరో క్రేజీ మల్టీస్టారర్ ప్రారంభోత్సవానికి సోమవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో వేదికగా నిలిచింది. వెంకటేశ్, పవన్‌కల్యాణ్ హీరోలుగా కిశోర్‌కుమార్ పార్థసాని (డాలీ) దర్శకత్వంలో డి. సురేశ్‌బాబు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ‘గోపాల... గోపాల’ చిత్రం షూటింగ్ ఘనంగా హైదరాబాద్‌లో మొదలైంది. నిర్మాతలు డి.రామానాయుడు, అల్లు అరవింద్, కె.ఎస్.రామారావు, జెమినీ కిరణ్, శ్యాంప్రసాద్‌రెడ్డి, బూరుగుపల్లి శివరామకృష్ణ, ఎన్.వి.ప్రసాద్, బీవీఎస్ఎన్ ప్రసాద్, నల్లమలుపు బుజ్జి, సాయి కొర్రపాటి, శానం నాగ అశోక్‌కుమార్, పొట్లూరి వరప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరై యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ -‘‘తెలుగుతెరపై ఇప్పటివరకూ రాని ప్రయోగమిది. వెంకటేశ్, పవన్‌కల్యాణ్ పాత్రలు భిన్నంగా ఉంటాయి. నేటి నుంచి చిత్రీకరణ పూర్తయ్యేంతవరకూ నిరవధికంగా షూటింగ్ జరుగుతుంది. అనూప్ రూబెన్స్ స్వరసారథ్యంలో ఇప్పటికే ఓ పాట రికార్డింగ్ పూర్తయింది. మరోవారంలో మొత్తం పాటల రికార్డింగ్ పూర్తవుతుంది. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ఫేం సాయిమాధవ్ బుర్రా మాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ’’ అని తెలిపారు. శ్రీయ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి ఓ ప్రత్యేక భూమిక పోషిస్తున్నారు. రంగనాథ్, రాళ్లపల్లి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, వెన్నెల కిషోర్, పృథ్వీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియ, ఉమేశ్ శుక్లా, కథనం: కిశోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా,దీపక్ రాజ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు: చంద్రబోస్, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మకడలి, నృత్యాలు: సుచిత్రా చంద్రబోస్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: వీరేన్ తంబిదొరై, భాస్కరరాజు, అభిరామ్. నిర్మాణం: సురేశ్ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్.