నిశ్శబ్దంగా పూర్తయింది | Nisabdham movie updates | Sakshi
Sakshi News home page

నిశ్శబ్దంగా పూర్తయింది

Aug 6 2019 2:35 AM | Updated on Aug 6 2019 2:35 AM

Nisabdham movie updates - Sakshi

హేమంత్, అనుష్క, కోన వెంకట్, షానీ

ఈ మధ్య కాలంలో సినిమా పూర్తి కావాలంటే తక్కువలో తక్కువ ఆరునెలలు టైమ్‌ పడుతుంది. కానీ ‘నిశ్శబ్దం’ చిత్రబృందం సైలెంట్‌గా రెండు నెలల్లోనే సినిమా షూటింగ్‌ పూర్తి చేయడం విశేషం. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే ముఖ్య పాత్రల్లో హేమంత్‌ మధుకర్‌ తెరకెక్కించిన చిత్రం ‘నిశ్శబ్దం’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.

సినిమా మొత్తం షూటింగ్‌ని అమెరికాలోని సీటెల్‌లో జరిపారు. సైలెంట్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కొందరు హాలీవుడ్‌ యాక్టర్స్‌ కూడా నటించారు. ‘‘షూటింగ్‌ పూర్తయింది. ఈ థ్రిల్లర్‌ను మీ అందరికీ త్వరగా చూపించేయాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. గోపీసుందర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement