మంచి సినిమాని ప్రోత్సహించాలి | Ninnu Thalachi Movie Trailer Launch By Boyapati Srinu | Sakshi
Sakshi News home page

మంచి సినిమాని ప్రోత్సహించాలి

Sep 25 2019 2:25 AM | Updated on Sep 25 2019 2:25 AM

Ninnu Thalachi Movie Trailer Launch By Boyapati Srinu - Sakshi

‘‘నిన్నుతలచి’ టైటిల్‌లోనే పాజిటివ్‌ ఎనర్జీ ఉంది. ఈ టైటిల్‌ను ఖరారు చేసినప్పుడే దర్శక–నిర్మాతలు సగం సక్సెస్‌ అయ్యారు. పరిశ్రమలో మంచి సినిమానా? కాదా? అని రెండే ఉంటాయి. మంచి చిత్రాన్ని మనం ప్రోత్సహించాల్సిందే. మంచి పాయింట్‌తో వస్తున్న ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. వంశీ ఎక్కసిరి, స్టెఫీ పాటిల్‌ జంటగా అనిల్‌ తోట దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిన్ను తలచి’. ఎస్‌.ఎల్‌.ఎన్‌ ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని బోయపాటి శ్రీను విడుదల చేశారు. అనిల్‌ తోట మాట్లాడుతూ– ‘‘ఎమోషనల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. శ్రీమణి, పూర్ణాచారి గార్లు అద్భుతమైన సాహిత్యం ఇచ్చారు.. మంచి స్పందన వస్తోంది. శ్యామ్‌ ప్రసాద్‌ చక్కటి విజువల్స్‌ అందించారు’’ అన్నారు. ‘‘ఓ ఫీల్‌ గుడ్‌ మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అవడం చాలా ఆనందంగా ఉంది’’ అని వంశీ ఎక్కసిరి, స్టెఫీ పాటిల్‌ అన్నారు. ‘‘నిర్మాత అజిత్‌గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మించారు’’ అన్నారు సంగీత దర్శకుడు  ఎలెందర్‌ మహావీర్‌.

Advertisement
 
Advertisement
Advertisement