‘ఇస్మార్ట్‌ శంకర్’లో గ్లామరస్‌ నిధి

Niddhi Agerwal In iSmart Shankar Movie Song Location - Sakshi

ఎనర్జిటిక్‌ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. డబుల్ దిమాక్ ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన భారీ సెట్లో ‘దిమాక్ ఖరాబ్...’ అనే పాటను చిత్రీకరిస్తున్నారు. వందమంది డ్యాన్సర్స్‌తో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. కాసర్లశ్యామ్ రాసిన ఈ పాట తెలంగాణ యాసలో సాగుతుంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఆన్‌లోకేషన్‌ స్టిల్స్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. వైబ్రేంట్ కాస్ట్యూమ్స్ లో ఉన్న నిధి అగర్వాల్‌ లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top