ఆహా..విందు పసందు

nayanthara Priced Anirudh Music In Kolamavu Kokila - Sakshi

తమిళసినిమా: మనిషి ఎంత సంపాదించినా రుచికరమైన ఆహారం బుజించకుంటే ఫలితం ఏముంటుంది. అదీ తన కిష్టమైన వారి విందు అయితే మహా పసందుగా ఉందనిపిస్తుంది. యువ సంచలన సంగీత దర్శకుడు అనిరుధ్‌ అలాంటి  ఇష్టమైన వారి పసందయిన విందును ఆరగించి మైమరచి ఆ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. ఆయన చెబుతున్నదెవరి గురించో అయితే పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. అగ్రనటి నయనతార తనకు పసందైన భోజనాన్ని పంపిస్తారని అనిరుధ్‌ చెబుతున్నారు. ఆ సంగతేంటో చూద్దాం రండీ. లేడీ సూపర్‌స్టార్‌ నయనతార నటిస్తున్న తాజా చిత్రాలలో కొలమావు కోకిల ఒకటి. నయనతార చుట్టూ తిరిగే ఈ చిత్రంలో హస్య నటుడు యోగిబాబు ప్రేమ అంటూ ఆమె చూట్టూ తిరుగుతాడు.

ఇదే మంచి వినోదాన్నిచ్చే అంశం కాగా ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌ సంగీత భాణీలను అందించడం మరో అస్సెట్‌. ఈ చిత్రంలోని రెండు పాటలు విడుదలై విశేష ఆదరణను పొందుతున్నాయట. దీంతో నయనతార అనిరుధ్‌ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ప్రతిగా అనిరుధ్‌ ఆమె మంచితనాన్ని, గొప్పతనాన్ని ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆయనేమన్నారో చూద్దాం. నయనతారది చాలా మంచి వ్యక్తిత్వం. అందరితోనూ చాలా ప్రేమగా వ్యవహరిస్తారు. ఆమెకు నా సంగీతం అంటే చాలా ఇష్టం. నా పాటలు విని పరవశించిపోతారు. పలుమార్లు నాకు ఫోన్‌ చేసి అభినందనలు తెలుపుతుంటారు. నేను మీకు వీరాభిమానిని అని మెసేజ్‌లు పంపిస్తుంటారు. కొన్ని సార్లు మంచి మంచి వంటకాలతో పసందైన విందును నాకు పంపిస్తుంటారు. అలాంటి ఆమె ప్రేమాభిమానాలు నాకు చాలా ఇష్టం అంటూ అనిరుధ్‌ నయనతారను ప్రశంసలతో ముంచెత్తారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top