నేను బాగానే ఉన్నాను | Naseeruddin Shah Hospitalization Rumors in Social Media | Sakshi
Sakshi News home page

నేను బాగానే ఉన్నాను

May 2 2020 4:46 AM | Updated on May 2 2020 4:46 AM

Naseeruddin Shah Hospitalization Rumors in Social Media - Sakshi

నసీరుద్దీన్‌ షా

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నసీరుద్దీన్‌ షా అనారోగ్యంతో హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యారు అనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే అందులో ఎటువంటి నిజం లేదని నసీరుద్దీన్‌ షా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ‘‘నాన్నగారికి ఏం కాలేదు. ఆయన బాగానే ఉన్నారు’’ అని ట్వీటర్‌ ద్వారా స్పందించారు ఆయన కుమారుడు వివాన్‌ షా. ‘నా ఆరోగ్య సమాచారం గురించి ఆందోళన చెందుతూ, నన్ను సంప్రదిస్తున్నవారందరికీ కృతజ్ఞతలు. నేను ఇంట్లోనే ఉన్నాను. ఆరోగ్యంగా ఉన్నాను. పుకార్లను నమ్మొద్దు’’  అని ఫేస్‌ బుక్‌ లో స్పష్టం చేశారు నసీరుద్దీన్‌ షా.

Advertisement
 
Advertisement
Advertisement