నర్తనశాల పేరు నిలబెట్టేలా ఉంటుంది | Narthanasala First Look Launch | Sakshi
Sakshi News home page

నర్తనశాల పేరు నిలబెట్టేలా ఉంటుంది

Jul 22 2018 12:59 AM | Updated on Jul 22 2018 12:59 AM

Narthanasala First Look Launch - Sakshi

శివాజీరాజా, యామిని, ఉషా మూల్పూరి, నాగశౌర్య, కష్మీర, శ్రీనివాస చక్రవర్తి

‘‘మా ‘నర్తనశాల’ సినిమా షూటింగ్‌ పూర్తయింది. లెజెండరీ చిత్రమైన ‘నర్తనశాల’ చిత్రం పేరు నిలబెట్టేలా మా సినిమా ఉంటుంది. శ్రీనివాస్‌గారు చాలా బాగా తీశారు. ఫస్ట్‌ లుక్‌ ఎంత ఫ్రెష్‌గా ఉందో సినిమా కూడా అంతే ఫ్రెష్‌గా, అందర్నీ ఎంటర్‌టైన్‌ చేసే విధంగా ఉంటుంది’’ అని నాగశౌర్య అన్నారు. నాగశౌర్య హీరోగా, కష్మీర పరదేశి, యామిని భాస్కర్‌ హీరోయిన్లుగా శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నర్తనశాల’. శంకర ప్రసాద్‌ మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. శ్రీనివాస చక్రవర్తి మాట్లాడుతూ– ‘‘నర్తనశాల’ చిత్రం ఇంత బాగా రావడానికి ముఖ్య కారణం నాగశౌర్య. ఆయన పాత్రలో ఇన్‌వాల్వ్‌ అయ్యి చేశాడు.

మా నిర్మాతలు శంకర్, ఉషా, బుజ్జి గార్లకు సినిమా అంటే ప్యాషన్‌. అందుకే ఈ బ్యానర్‌లో ఏ చిత్రం వచ్చినా అది బ్లాక్‌బస్టర్‌ ఖాయం’’ అన్నారు. ‘‘ఛలో’ చిత్రాన్ని ఎంత ఘనవిజయం చేశారో ‘నర్తనశాల’ని కూడా అంతకు మించి హిట్‌ చేయాలి. ఈ చిత్రం తప్పకుండా అందర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది’’ అన్నారు ఉషా మూల్పూరి. ‘‘నర్తనశాల’ అందరి చిత్రంగా మీ ముందుకు వస్తుంది. అందరూ ‘ఛలో’ కంటే మంచి విజయాన్ని అందించాలి’’ అన్నారు శంకర్‌ప్రసాద్‌ మూల్పూరి. కష్మీర పరదేశి, యామిని భాస్కర్, నటులు శివాజీ రాజా, కొరియోగ్రాఫర్‌ విజయ్, కెమెరామేన్‌ విజయ్‌ సి.కుమార్, లైన్‌ ప్రొడ్యూసర్‌ బుజ్జి, పాటల రచయితలు ఓరుగంటి, శ్రీమణి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement