ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు: అనన్య | Ananya Nagalla At Leesa First Look Poster Release | Sakshi
Sakshi News home page

ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు: అనన్య

Apr 14 2026 12:05 AM | Updated on Apr 14 2026 12:05 AM

Ananya Nagalla At Leesa First Look Poster Release

వెంకట్‌ దుగ్గిరెడ్డి, అనన్య నాగళ్ల, ఐలా రామకృష్ణ

‘‘లీసా’ చిత్ర కథ విన్నప్పుడు ఇలాంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదనిపించింది.  హీరోయిన్లుగా ఇలాంటి చిత్రాలు మాకు అరుదుగా దక్కుతుంటాయి. ‘లీసా’ నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరోయిన్‌ అనన్య నాగళ్ల చెప్పారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లీసా’. జవహర్‌లాల్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నారు.

వెంకట్‌ దుగ్గిరెడ్డి (యూఎస్‌ఏ), రామకృష్ణ ఐలా (యూఎస్‌ఏ) నిర్మిస్తున్నారు. సౌజన్య సతీష్‌ రెడ్డి మాసం కోప్రోడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో దర్శకుడు జవహర్‌లాల్‌ రాజు మాట్లాడుతూ–‘‘లీసా’లో ఒక డిఫరెంట్‌ స్క్రీన్‌ ప్లే, మేకింగ్‌ చూస్తారు’’ అని తెలిపారు. ‘‘ఈ స్టోరీ విన్న తర్వాత బలమైన ప్రాజెక్ట్‌ అవుతుందనే నమ్మకం కలిగింది’’ అని రామకృష్ణ ఐలా పేర్కొన్నారు. ‘‘లీసా’ హిట్‌ అయితే మాకు మరో సినిమాని పారితోషికం తీసుకోకుండా చేస్తానని అనన్య చెప్పారు’’ అన్నారు వెంకట్‌ దుగ్గిరెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement