breaking news
Lees
-
ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు: అనన్య
‘‘లీసా’ చిత్ర కథ విన్నప్పుడు ఇలాంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదనిపించింది. హీరోయిన్లుగా ఇలాంటి చిత్రాలు మాకు అరుదుగా దక్కుతుంటాయి. ‘లీసా’ నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరోయిన్ అనన్య నాగళ్ల చెప్పారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లీసా’. జవహర్లాల్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు.వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రామకృష్ణ ఐలా (యూఎస్ఏ) నిర్మిస్తున్నారు. సౌజన్య సతీష్ రెడ్డి మాసం కోప్రోడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు జవహర్లాల్ రాజు మాట్లాడుతూ–‘‘లీసా’లో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే, మేకింగ్ చూస్తారు’’ అని తెలిపారు. ‘‘ఈ స్టోరీ విన్న తర్వాత బలమైన ప్రాజెక్ట్ అవుతుందనే నమ్మకం కలిగింది’’ అని రామకృష్ణ ఐలా పేర్కొన్నారు. ‘‘లీసా’ హిట్ అయితే మాకు మరో సినిమాని పారితోషికం తీసుకోకుండా చేస్తానని అనన్య చెప్పారు’’ అన్నారు వెంకట్ దుగ్గిరెడ్డి. -
మంత్రి గంటాపై మరో మంత్రి అయ్యన్న చిందులు
-
దైవం ఇచ్చిన బహుమానం
సువార్త బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు. - సామెతలు 22:6 ఈ ప్రపంచంలో కల్మషం లేనిది ఏదైనా ఉంది అంటే... అది పసివాళ్ల మనసే అని చెప్పాలి. కానీ ఆ నిష్కల్మషత్వం ఎప్పటి వరకు ఉంటుంది! ఈ లోకం గురించి తెలుసుకునే వరకూ ఉంటుంది. లోకాశలకు లోబడే వయసు రానంతవరకే ఉంటుంది. ఆ తర్వాత వారి బాట వేరవుతుంది. దేవుడి నుంచి దూరమవుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే వారిలో మంచి అనేది చిన్నతనంలోనే పెరగాలి. అలా పెరిగేలా తల్లిదండ్రులు చూడాలి. అందుకే పిల్లల పెంపకం గురించి తల్లిదండ్రులకు ఎన్నో విషయాలు చెప్పాడు ప్రభువు. వారిని సరైన దారిలో పెంచాల్సిన బాధ్యత మీదే అని పదే పదే హెచ్చరించాడు. పైన చెప్పుకున్న వాక్యమే అందుకు నిదర్శనం. అంతేకాక... ‘‘తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక, ప్రభువు యొక్క శిక్షలోను, బోధలోను వారిని పెంచుడి’’ అన్నాడు ప్రభువు ఎఫెసీ 6:4లో. ఈ ఒక్క మాట చాలు పిల్లలను ఎలా పెంచాలో తెలుసుకోవడానికి. కోపం మనిషికి శత్రువు. అది మనిషిని విచక్షణా రహితుణ్ని చేస్తుంది. తప్పులు చేయిస్తుంది. అందుకే కోపానికి దూరంగా ఉండాలి. ఆ దూరంగా ఉండటం అన్నది చిన్ననాటి నుంచే జరగాలి. కోపమనే విత్తును పిల్లల మనసుల్లో నాటకుండా ఉండాలి. దేవుడి బోధలను, ప్రవచనాలు వివరించి... వాటిని అనుసరించి నడచుకునే విధంగా వారిని తీర్చిదిద్దాలి. నిజానికి పిల్లలు ఎలా ఉండాలి అన్నదానికి అత్యంత గొప్ప ఉదాహరణ యేసుక్రీస్తే. తన తండ్రియైన యెహోవా దేవుని ఆజ్ఞ మేరకు క్రీస్తు ఈ లోకంలో మనిషిగా జన్మించాడు. తన తండ్రి రాజ్యాన్ని ఈ నేలమీద స్థాపించాడు. తన తండ్రి ఆదేశించిన విధంగా శిలువ మరణం పొందాడు. ఓ గొప్ప కొడుక్కి అసలు సిసలు ఉదాహరణ క్రీస్తు. మరి మనకొద్దా అలాంటి గొప్ప బిడ్డలు! గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం (కీర్తనలు 127:3). ఆయన ఇచ్చిన బహుమానాన్ని పదిలంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఆయన అనుగ్రహించిన స్వాస్థ్యాన్ని ఆయన ఘనతను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా చేయాల్సిన బాధ్యత మనది. కాబట్టి పిల్లల నడవడికను కనిపెట్టాలి. నడవాల్సిన తోవను చూపించాలి. చేరాల్సిన గమ్యాన్ని నిర్దేశించాలి. - జాయ్స్ మేయర్


