మార్చిలో నాని కొత్త సినిమా..! | Nani Kishore Tirumala movie start soon | Sakshi
Sakshi News home page

Jan 4 2018 3:35 PM | Updated on Jan 4 2018 3:35 PM

Nani Kishore Tirumala movie start soon - Sakshi

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని ఇటీవల ఎంసీఏ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటిస్తున్న నాని.. త్వరలో మరో సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న కృష్ణార్జున యుద్ధం ఇప్పటికే మేజర్ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేశాడు నాని. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలను తెరకెక్కించిన కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు నాని. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి రెండో వారంలో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement