ప్రేమ, వినోదం | Nandikonda vagullona Movie in Love, fun | Sakshi
Sakshi News home page

ప్రేమ, వినోదం

Jun 5 2016 10:58 PM | Updated on Sep 4 2017 1:45 AM

ప్రేమ, వినోదం

ప్రేమ, వినోదం

సెంటిమెంట్, ప్రేమ, వినోదం కథాంశంగా తెరకెక్కిన చిత్రం ‘నందికొండ వాగుల్లోన’.

సెంటిమెంట్, ప్రేమ, వినోదం కథాంశంగా తెరకెక్కిన చిత్రం ‘నందికొండ వాగుల్లోన’. సాయికిరణ్, ఆనంద్, కల్యాణ్, పూజాశ్రీ, మేఘన, నట్‌ష్యా ప్రధాన పాత్రల్లో ఏకారి సత్యనారాయణ దర్శకత్వంలో బీచుపల్లి ఆంజనేయ ప్రొడక్షన్స్, షేరింగ్ టాలెంట్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. బీచుపల్లి రఘు మాట్లాడుతూ- ‘‘నేటి ట్రెండ్‌కు తగ్గట్టు అన్ని అంశాలతో నిర్మించిన చిత్రమిది. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తీర్చిదిద్దాం.

కథను దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. ఊటీ, గోవా, హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ జరిపాం. త్వరలో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది ’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: లక్కీ, సంగీతం: నవనీత్ చారి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement