breaking news
Nandikonda vagullona
-
అర్జున్‌రెడ్డికి మించి...
షఫీ, లక్కీ ఏకరీ, సాయికిరణ్, పూజశ్రీ, మేఘన, జ్యోతికయాదవ్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘నందికొండ వాగుల్లోన’. సత్యనారాయణ ఏకరీని దర్శకుడిగా పరిచయం చేస్తూ రఘు.హెచ్ ఈ చిత్రం నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని, నవనీత్ స్వరపరచిన పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సమర్పకులు సాయి వెంకట్, షిరాజ్ మాట్లాడుతూ– ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో కంటే ఎక్కువ కంటెంట్ ఉంటుంది. ముఖ్యంగా బి, సి సెంటర్స్‌లో బాగా ఆడుతుందని నమ్ముతున్నాం. మార్చి 2న సినిమాను విడుదల చేయాలనుకున్నాం. కానీ, థియేటర్ల బంద్ కారణంగా రిలీజ్ చేయడం లేదు. మంచి డేట్ చూసుకొని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఎ సర్టిఫికెట్ వచ్చిన సినిమానా? అనుకోకండి. ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు సత్యనారాయణ. ‘‘మా సినిమా రిలీజ్ చేయడానికి ముందుకొచ్చిన సాయివెంకట్, ఆర్.కె. గౌడ్గార్లకు ధన్యవాదాలు’’ అని నిర్మాత రఘు అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఆర్.కె. గౌడ్ పాల్గొన్నారు. -
ప్రేమ, వినోదం
సెంటిమెంట్, ప్రేమ, వినోదం కథాంశంగా తెరకెక్కిన చిత్రం ‘నందికొండ వాగుల్లోన’. సాయికిరణ్, ఆనంద్, కల్యాణ్, పూజాశ్రీ, మేఘన, నట్ష్యా ప్రధాన పాత్రల్లో ఏకారి సత్యనారాయణ దర్శకత్వంలో బీచుపల్లి ఆంజనేయ ప్రొడక్షన్స్, షేరింగ్ టాలెంట్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. బీచుపల్లి రఘు మాట్లాడుతూ- ‘‘నేటి ట్రెండ్‌కు తగ్గట్టు అన్ని అంశాలతో నిర్మించిన చిత్రమిది. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తీర్చిదిద్దాం. కథను దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. ఊటీ, గోవా, హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ జరిపాం. త్వరలో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది ’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: లక్కీ, సంగీతం: నవనీత్ చారి.