బాలకృష్ణ భావోద్వేగం | Nandamuri Balakrishna Emotional | Sakshi
Sakshi News home page

హరికృష్ణ చరిత్రలో నిలిచిపోతారన్న చంద్రబాబు

Aug 29 2018 7:55 PM | Updated on Aug 29 2018 8:31 PM

Nandamuri Balakrishna Emotional - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న బాలకృష్ణ

హరికృష్ణ లేరన్న విషయం ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదని నందమూరి బాలకృష్ణ అన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: ఎన్టీఆర్‌కు రథసారథిగా నందమూరి హరికృష్ణ చరిత్రలో నిలిచిపోతారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యుడిని, పార్టీలో ముఖ్య నేతను కోల్పోయామన్నారు. హరికృష్ణ నిర్మోహమాటంగా అభిప్రాయాలు వ్యక్తీకరించేవారని గుర్తు చేశారు.

నమ్మబుద్ధి కావడం లేదు: బాలకృష్ణ
హరికృష్ణ లేరన్న విషయం ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదని నందమూరి బాలకృష్ణ అన్నారు. తన సోదరుడు సంస్కృతి, సంప్రదాయం, బంధుత్వానికి ప్రాధాన్యం ఇచ్చే వారని గుర్తు చేసుకున్నారు. హరికృష్ణ లేకపోవడం తమ కుటుంబానికి తీరని లోటని భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు.

రెండు రోజులు సంతాప దినాలు
నందమూరి హరికృష్ణ మృతికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంతాపం తెలిపింది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు సంతాప దినాలుగా పాటించాలని ప్రకటించింది. జాతీయ జెండాను అవనతం చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో హరికృష్ణ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

Advertisement
 
Advertisement
Advertisement