బిగ్‌బాస్‌ 3: నాగ్‌ రికార్డ్‌! | Nagarjuna Bigg Boss 3 Telugu Launch Episode Record TRP | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ను వెనక్కి నెట్టిన నాగ్‌!

Aug 1 2019 1:49 PM | Updated on Aug 1 2019 4:40 PM

Nagarjuna Bigg Boss 3 Telugu Launch Episode Record TRP - Sakshi

సెన్సేషనల్‌ గేమ్‌ షో బిగ్‌బాస్‌కు సంబంధించిన ప్రతీ వార్త మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారుతుంది. ఎన్నో వివాదాలకు తెర తీస్తున్న ఈ గేమ్‌ షో టీఆర్పీల విషయంలోనూ సంచలనాలు నమోదు చేస్తోంది. అయితే బిగ్‌బాస్‌ను ఇతర కార్యక్రమాలతో కన్నా ఎక్కువగా గత సీజన్లతో ఈ మూడో సీజన్‌ను పోల్చి చూస్తున్నారు ప్రేక్షకులు.

అయితే తాజాగా వచ్చిన టీఆర్పీలను చూస్తే మూడో సీజన్‌ గత సీజన్ల కన్నా ఎక్కువగా ప్రజాధరణ పొందుతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు హోస్ట్‌గా నాగార్జున కూడా ఎన్టీఆర్‌, నానిలను మించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడట. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి సీజన్‌ తొలి ఎపిసోడ్‌కు 16.18 రేటింగ్‌ రాగా, నాని హోస్ట్ చేసిన రెండో సీజన్‌కు ఫస్ట్‌ ఎపిసోడ్‌కు 15.05 రేటింగ్ వచ్చింది. వీళ్లిద్దరినీ వెనక్కి నెట్టిన నాగ్‌ తొలి ఎపిసోడ్‌కు 17.92 రేటింగ్‌ సాధించి టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు.

జూలై 21న ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే హేమ ఎలిమినేట్‌ కాగా, వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా ట్రాన్స్‌జెండర్‌ తమన్నా సింహాద్రి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్‌ బాస్‌ 3తో పాటు మన్మథుడు 2 సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న నాగ్‌, బుల్లి తెర మీద తన ఆదిపత్యాన్ని నిలబెట్టుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement