మోహన్ లాల్ ఫస్ట్ లుక్ వచ్చేసింది | mohan lal first look from janatha garage | Sakshi
Sakshi News home page

మోహన్ లాల్ ఫస్ట్ లుక్ వచ్చేసింది

May 21 2016 12:10 PM | Updated on Sep 4 2017 12:37 AM

మోహన్ లాల్ ఫస్ట్ లుక్ వచ్చేసింది

మోహన్ లాల్ ఫస్ట్ లుక్ వచ్చేసింది

మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ తొలిసారిగా ఓ తెలుగు సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. గతంలో బాలకృష్ణ నటించిన గాంఢీవం సినిమాలో ఒక పాటలో కనిపించిన...

మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తొలిసారిగా ఓ తెలుగు సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. గతంలో బాలకృష్ణ నటించిన గాండీవం సినిమాలో ఒక పాటలో కనిపించిన ఈ స్టార్ హీరో, ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. శుక్రవారం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ లుక్ రివీల్ చేస్తూ రెండు పోస్టర్స్ రిలీజ్ చేశారు.

ఒక్కరోజు గ్యాప్లో ఈ సినిమాలో నటిస్తున్న మోహన్ లాల్ లుక్ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్స్ను మళయాళంలో రిలీజ్ చేయటం విశేషం. శనివారం మళయాళ సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా జనతా గ్యారేజ్ మళయాల టైటిల్తో పాటు మోహన్ లాల్ లుక్ను రివీల్ చేశారు. రఫ్ లుక్లో డాన్లా కనిపిస్తున్న మోహన్ లాల్ వెంట రఘు, బ్రహ్మాజీ, బెనర్జీ, అజయ్లు నడిచి వస్తున్న పోస్టర్కు మాలీవుడ్లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తెలుగుతో పాటు మళయాలంలోనూ ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement