ప్రాణాపాయ స్థితిలో బాలీవుడ్ యువ దర్శకుడు

Mission Mangal Director Jagan Shakti Hospitalised In Serious Condition - Sakshi

ముంబై: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ జగన్ శక్తి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో ఆనందంగా గడుపుతున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆరగ్య పరిస్థితి విషమంగా ఉందని, మెదడులో రక్తం గడ్డకట్టిందని డాక్టర్లు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం జగన్ శక్తి, తన తదుపరి చిత్రం కోసం అక్షయ్ కుమార్‌తో చర్చలు జరుపుతున్న వేళ ఈ ఘటన జరిగింది. కాగా.. జగన్‌ శక్తి గతంలో హాలీడే, ఇంగ్లీష్ వింగ్లీష్, డియర్ జిందగీ చిత్రాలకు జగన్ సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2019లో రిలీజ్‌ అయిన 'మిషన్ మంగళ్' చిత్రంతో ఆయన డైరెక్టర్‌గా మారారు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. మొదటి చిత్రంతోనే జగన్ ఎన్నో అవార్డులు అందుకున్నారు. బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్, విద్యా బాలన్, సోనాక్షీ సిన్హా, తాప్సీ, నిత్యా మీనన్‌లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. (ఒకే ఏడాది రూ.750 కోట్ల వసూళ్లు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top