ఒకే ఏడాది రూ.750 కోట్ల వసూళ్లు | Hero Akshay Kumar Created History In 2019 With 750 Crore Collections | Sakshi
Sakshi News home page

ఏడాదిలో రూ.750 కోట్లు వసూళ్లు రాబట్టిన స్టార్‌హీరో

Jan 3 2020 9:39 PM | Updated on Jan 3 2020 10:11 PM

Hero Akshay Kumar Created History In 2019 With 750 Crore Collections - Sakshi

జయాపజయాలతో ప్రమేయం లేకుండా వరుస సినిమాలు చేసుకుపోయే బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ 2019కి గానూ ఓ రికార్డ్ సాధించాడు. బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన హీరోగా చరిత్ర సృష్టించాడు. కేసరితో 2019ని మొదలుపెట్టి.. మిషన్ మంగళ్, హౌస్‌ఫుల్ 4, గుడ్ న్యూస్ వంటి సినిమాలతో వరుసగా బాక్సాఫీస్ దగ్గర సందడి చేసాడు అక్షయ్. ఈ సినిమాలన్నీ కలిపి దాదాపు 750 కోట్లు వసూలు చేశాయి. ఒకే ఏడాది 750 కోట్లు వసూలు చేయడం అంటే చిన్న విషయం కాదు.. కానీ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చేసి చూపించాడు.  

చదవండి: భర్త వెంటే భార్య ఎందుకు నడవాలంటే..!

2020లోనూ ఇదే హవాను కొనసాగించడానికి నాలుగు సినిమాలతో సిద్ధంగా ఉన్నాడు అక్షయ్‌. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న కాంచన రీమేక్ లక్ష్మీబాంబ్‌, రోహిత్ శెట్టి సూర్వ వంశీ, పృథ్వీరాజ్ చిత్రాలతో పాటు మరో సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

చదవండి: '79 ఏళ్ల వయసులో ఏడుగురిని చిత్తు చేసింది'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement