యంజీఆర్‌ మళ్లీ వస్తున్నారు | mgr biopic directed by p vasu | Sakshi
Sakshi News home page

యంజీఆర్‌ మళ్లీ వస్తున్నారు

Sep 20 2018 12:27 AM | Updated on Sep 20 2018 12:28 AM

mgr biopic directed by p vasu - Sakshi

యంజీఆర్‌

యంజీఆర్‌ అభిమానులకు ఓ గుడ్‌ న్యూస్‌. మళ్లీ తెరపై తమ అభిమాన నటుణ్ణి చూసుకొనే అవకాశం ఉంది. నటుడిగా సూపర్‌స్టార్‌ అయి, ఆ తర్వాత రాజకీయాల్లో ముఖ్యమంత్రి హోదాను అందుకొని తమిళనాట చిరస్థాయి ఖ్యాతిని గడించారు యంజీఆర్‌. ఆరెంజ్‌ కంట్రీ అనే ఓ మలేషియన్‌ కంపెనీ యంజీర్‌ను తిరిగి తెర మీదకు తీసుకురావడానికి ప్లాన్‌ చేస్తోంది.

యన్‌ ఫేస్‌ టెక్నాలజీ ద్వారా యంజీర్‌ను తిరిగి  స్క్రీన్‌ మీద చూపించనున్నారు. ‘నరసింహా, చంద్రముఖి’ వంటి హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన పి.వాసుని డైరెక్టర్‌గా ఎంచుకున్నారు. 22 మిలియన్‌ డాలర్స్‌ బడ్జెట్‌తో తెరకెక్కబోయే ఈ ప్రాజెక్ట్‌ను ప్రాంతీయ భాషల్లోని నటులతో షూట్‌ చేయనున్నాం అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement