ముగ్గురికి ఓకే చెప్పాడు | Mega Hero varun tej busy with three films | Sakshi
Sakshi News home page

ముగ్గురికి ఓకే చెప్పాడు

Oct 31 2015 11:19 AM | Updated on Mar 22 2019 1:53 PM

ముగ్గురికి ఓకే చెప్పాడు - Sakshi

ముగ్గురికి ఓకే చెప్పాడు

తొలి సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, రెండో సినిమాతో తన స్టామినా నిరూపించుకున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. మెగా వారసుడిగా టాలీవుడ్కి పరిచయం అయిన వరుణ్...

తొలి సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, రెండో సినిమాతో తన స్టామినా నిరూపించుకున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. మెగా వారసుడిగా టాలీవుడ్కి పరిచయం అయిన వరుణ్,  'కంచె' సక్సెస్తో బిజీ హీరోగా మారిపోయాడు. దసరా సినిమాల్లో బిగెస్ట్ హిట్గా నిలిచిన 'కంచె'.. ఒక్కసారిగా వరుణ్ తేజ్ను బిజీ స్టార్ గా మార్చేసింది. ఇప్పటికే ఓ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న ఈ యంగ్ హీరో మరో రెండు సినిమాలకు ఓకే చెప్పాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం వరుణ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'మా అమ్మ సీతామాలక్ష్మి' సినిమాలో నటిస్తున్నాడు. మదర్ సెంటిమెంట్తో పాటు పూరి మార్క్ మాస్ ఎలిమెంట్స్తో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత, మరో కమర్షియల్ ఎంటర్టైనర్కు రెడీ అవుతున్నాడు. తన తొలి సినిమాను నిర్మించిన ఠాగూర్ మధు నిర్మాణంలో మరో సినిమా చేయనున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ క్రీడాకారుడిగా కనిపించనున్నాడు.

ఈ రెండు సినిమాలతో పాటు 'కంచె' లాంటి భారీ హిట్తో తన కెరీర్ను గాడిలో పెట్టిన క్రిష్ (రాధకృష్ణ జాగర్లమూడి) దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూడు సినిమాలతో స్టార్ హీరోల లిస్ట్లో చేరిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు వరుణ్.

Advertisement
 
Advertisement
Advertisement