మిస్టర్ తేజ్ | Mega Hero Turns Mister Varun Tej | Sakshi
Sakshi News home page

మిస్టర్ తేజ్

Apr 19 2016 11:16 PM | Updated on Sep 3 2017 10:16 PM

మిస్టర్  తేజ్

మిస్టర్ తేజ్

ఆరడుగులకు పైగా ఎత్తు....మ్యాన్లీ లుక్స్, నేచురల్ యాక్టింగ్‌తో వరుణ్‌తేజ్ మూడు సినిమాలతోనే ప్రామిసింగ్ స్టార్ అనిపించుకున్నారు.

 ఆరడుగులకు  పైగా ఎత్తు....మ్యాన్లీ లుక్స్, నేచురల్ యాక్టింగ్‌తో వరుణ్‌తేజ్ మూడు సినిమాలతోనే ప్రామిసింగ్ స్టార్ అనిపించుకున్నారు. ఆయన నటించిన ‘కంచె’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు సాధించడంతో ఒక్కసారిగా క్రేజ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. దాంతో ఆయన తదుపరి చిత్రంపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఆయన శ్రీను వైట్ల దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘మిస్టర్’ అనే టైటిల్ ఖరారు చేశారు.
 
 లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ‘ఠాగూర్’ మధు, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ మే 15 నుంచి స్పెయిన్‌లో జరగనుంది. ఇందులో లావణ్యా త్రిపాఠీ, హెబ్బా పటేల్ కథానాయికలు. నిర్మాతలు ‘ఠాగూర్’ మధు, నల్ల మలుపు శ్రీనివాస్(బుజ్జి) మాట్లాడుతూ-‘‘ఈ చిత్రానికి స్క్రిప్టు చాలా బాగా వచ్చింది.
 
 ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ సిద్ధమవుతోంది. ఊటీలో దర్శకుడు శ్రీను వైట్ల, రచయితలు గోపీమోహన్, శ్రీధర్ సీపానలు ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఈ నెలాఖరున లాంచనంగా పూజాకార్యక్రమాలు నిర్వహిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: యువరాజ్, సమర్పణ: బేబీ భవ్య.
 

Advertisement
 
Advertisement
Advertisement