పటాపంచలు చేసేసిన సమంత

Married Samantha Get Good Roles Says Vishal - Sakshi

సాక్షి, చెన్నై: స్టార్‌ హీరోయిన్‌ సమంత అక్కినేనిపై కోలీవుడ్‌ స్టార్‌ హీరో విశాల్‌ ప్రశంసలు గుప్పించారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ఇరుంబు తిరై చిత్రం విడుదలై, హిట్‌ టాక్‌ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో గురువారం ఈ చిత్ర సక్సెస్‌ మీట్‌ను చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాల్‌ మాట్లాడుతూ... సమంతపై పొగడ్తల వర్షం గుప్పించారు. ‘సమంత నిజంగా ఓ అద్భుతం. సాధారణంగా వివాహం అయ్యాక హీరోయిన్లకు గుర్తింపు ఉన్న పాత్రలు దక్కవనే అంతా అనుకుంటుంటారు. కానీ, సామ్‌ దానిని పటాపంచలు చేసింది. వరుసగా ఫెర్‌ఫార్మెన్స్‌ బేస్డ్‌ చిత్రాలు చేస్తూ సక్సెస్‌లతో దూసుకుతున్నారు. ఆమెను చూస్తే గర్వంగా ఉంది. ఈ చిత్రంలో ఆమె నటన అమోఘం. ఆమెతో పని చేయటం ఎంతో ఆనందానిచ్చింద’ని విశాల్‌ చెప్పారు. 

గతేడాది మెర్సల్‌తోపాటు, ఈ ఏడాది రంగస్థలంలో రామలక్ష్మి, మహానటిలో మధుర వాణి, ఇప్పుడు ఇరుంబు తిరైలో సైకాలజిస్ట్‌ రతిదేవి పాత్రలో మంచి ఫెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చి చిత్ర విజయాల్లో ఆమె ముఖ్య భూమిక పోషించారు. అర్జున్‌ ముఖ్య పాత్రలో మిత్రన్‌(డెబ్యూ) డైరెక్షన్‌లో తెరకెక్కిన ఇరుంబు తిరై త్వరలో అభిమన్యుడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో కన్నడ హిట్‌ మూవీ యూటర్న్‌ రీమేక్‌(తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కుతోంది)తోపాటు, తమిళ్‌లో విజయ్‌ సేతుపతి, శివకార్తీకేయన్‌ చిత్రాలు ఉన్నాయి. ఇవిగాక నిన్ను కోరి ఫేమ్‌ శివ నిర్వాణ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా కనిపించబోతుందన్న టాక్‌ ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top