మంచు విష్ణు లక్కున్నోడు | Manchu Vishnu Next movie title Luckunnodu | Sakshi
Sakshi News home page

మంచు విష్ణు లక్కున్నోడు

Aug 12 2016 12:51 PM | Updated on Sep 4 2017 9:00 AM

మంచు విష్ణు లక్కున్నోడు

మంచు విష్ణు లక్కున్నోడు

చాలా రోజుల తరువాత ఆడో రకం ఈడోరకం సినిమాతో సక్సెస్ కొట్టిన మంచు విష్ణు, అదే జోరులో వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో సరద అనే సినిమా చేస్తున్న విష్ణు, మరో...

చాలా రోజుల తరువాత ఆడో రకం ఈడోరకం సినిమాతో సక్సెస్ కొట్టిన మంచు విష్ణు, అదే జోరులో వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో సరద అనే సినిమా చేస్తున్న విష్ణు, మరో రెండు సినిమాలకు లైన్లో పెట్టాడు. అంతేకాదు ఆ రెండు సినిమాలకు టైటిల్స్  కూడా ప్రకటించేసి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు విష్ణు.సరద సినిమా షూటింగ్ చివరి దశకు రావటంతో తను చేయబోయే నెక్ట్స్ సినిమా మీద క్లారిటీ ఇచ్చాడు.

గీతాంజలి సినిమాతో ఆకట్టుకున్న రాజ్ కిరణ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ కామెడీ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాను ఎంవివి సినిమా బ్యానర్పై ఎంవివి సత్యనారాయణ నిర్మించనున్నాడు. ఈసినిమాకు లక్కున్నోడు అనే టైటిల్ను ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాతో పాటు మోహన్ బాబుతో కలిసి సేనపతి అనే సినిమాకు కూడా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు విష్ణు.

Advertisement
 
Advertisement
Advertisement