విష్ణు లక్కున్నోడు! | Manchu Vishnu Is Luckunnodu! | Sakshi
Sakshi News home page

విష్ణు లక్కున్నోడు!

Aug 13 2016 1:03 AM | Updated on Sep 4 2017 9:00 AM

విష్ణు లక్కున్నోడు!

విష్ణు లక్కున్నోడు!

మంచు విష్ణు కథానాయకుడిగా రాజకిరణ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించనున్న చిత్రానికి ‘లక్కున్నోడు’

మంచు విష్ణు కథానాయకుడిగా రాజకిరణ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించనున్న చిత్రానికి ‘లక్కున్నోడు’ టైటిల్ ఖరారు చేశారు. త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుంది. నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ - ‘‘విభిన్న కథాంశాలతో కూడిన సినిమాల్లో నటిస్తున్న విష్ణు హీరోగా మా సంస్థలో సినిమా చేయనుండటం సంతోషంగా ఉంది.

 ‘గీతాంజలి’, ‘త్రిపుర’ వంటి హారర్ సినిమాలు తీసిన దర్శకుడు రాజకిరణ్, ఈసారి వాటికి భిన్నంగా లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. సెప్టెంబర్ రెండోవారంలో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి రచన-మాటలు: డైమండ్ రత్నం, ఎడిటింగ్: మధు, కెమేరా: సాయిశ్రీరామ్, సహ నిర్మాతలు: వి.ఎస్.ఎన్.కుమార్, విజయ్‌కుమార్ రెడ్డి.
 

Advertisement
 
Advertisement
Advertisement