అర్జున్‌.. అను | Manchu vishnu and kajal aggarwal look release from mosagallu | Sakshi
Sakshi News home page

అర్జున్‌.. అను

Jun 19 2020 5:35 AM | Updated on Jun 19 2020 5:35 AM

Manchu vishnu and kajal aggarwal look release from mosagallu - Sakshi

మంచు విష్ణు హీరోగా నటిస్తూ, నిర్మిస్తోన్న హాలీవుడ్‌–ఇండియన్‌ చిత్రం ‘మోసగాళ్ళు’. హాలీవుడ్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్‌ దర్శకుడు. కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. నేడు కాజల్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని విష్ణు–కాజల్‌ల లుక్‌ని విడుదల చేశారు. విష్ణు  పాత్ర పేరు అర్జున్, కాజల్‌ పాత్ర పేరు అను. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. లాక్‌డౌన్‌కి ముందే ఈ చిత్రం మేజర్‌ షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. క్లయిమాక్స్, మరికొన్ని ఎపిసోడ్స్‌ చిత్రీకరించాల్సి ఉంది. ఈ చిత్రానికి కెమెరా: షెల్డన్‌ చౌ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌కుమార్‌ ఆర్‌.

Advertisement
 
Advertisement
Advertisement