జనతా గ్యారేజ్లో మరో మళయాలి | Malayala Hero Unni mukundhan in ntr Janatha Garage | Sakshi
Sakshi News home page

జనతా గ్యారేజ్లో మరో మళయాలి

Jan 31 2016 8:11 AM | Updated on Sep 3 2017 4:38 PM

జనతా గ్యారేజ్లో మరో మళయాలి

జనతా గ్యారేజ్లో మరో మళయాలి

నాన్నకు ప్రేమతో సక్సెస్తో సూపర్ ఫాంలోకి వచ్చిన ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమా జనతా గ్యారేజ్. శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన కొరటాల శివ...

నాన్నకు ప్రేమతో సక్సెస్తో సూపర్ ఫాంలోకి వచ్చిన ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమా జనతా గ్యారేజ్. శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ స్టార్ కాస్ట్ను సెట్ చేస్తున్నారు. ఇప్పటికే ఓ కీలకపాత్రకు మోహన్ లాల్ సంప్రదించారు. ఈసినిమాలో  నటించడానికి తెలుగు కూడా నేర్చుకుంటున్నట్టుగా తెలిపాడు మళయాలి సూపర్ స్టార్. హీరోయిన్గా మళయాలి ముద్దుగుమ్మ నిత్యమీనన్ను ఎంపిక చేయగా మరో హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది.

వీరితో పాటు మరో మళయాలి స్టార్ ఫహాద్ ఫాజిల్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా వార్తలు వినిపించినా చిత్రయూనిట్ మాత్రం కన్ఫామ్ చేయలేదు. ఇప్పుడు మరో మళయాల యువ నటుడు ఉన్ని ముకుందన్ను ఈ సినిమాలో విలన్ పాత్రకు ఎంపిక చేశారన్న వార్త హాట్ టాపిక్గా మారింది. మరి ఫహాద్ ఫాజిల్ను అనుకున్న పాత్రకే ఉన్ని ముకుందన్ను తీసుకున్నారా.. లేక మరో పాత్రకా అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే జనతా గ్యారేజ్లో  తాను నటిస్తున్నట్టుగా ఉన్నిముకుందన్ స్వయంగా ప్రకటించటంతో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్లో మరో మళయాలి స్టార్ వచ్చి చేరినట్టుగా కన్ఫామ్ అయ్యింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement