మరో సైన్స్‌ ఫిక్షన్‌

Latest Update About Bharateeyudu 2 Sequel - Sakshi

దర్శకుడు శంకర్‌ సినిమాల్లో గ్రాఫిక్స్‌ వర్క్స్‌ ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. త్వరలో విడుదల కానున్న సైన్స్‌ ఫిక్షన్‌ ‘2.0’లో అంతా గ్రాఫిక్సే. ఆ మాటకొస్తే ఈ చిత్రం ఫస్ట్‌ పార్ట్‌ కూడా గ్రాఫిక్స్‌ బేస్డ్‌గానే ఉంటుంది. నవంబర్‌ 29న ఈ చిత్రం విడుదల కానుంది. ‘2.0’ తర్వాత శంకర్‌ ‘భారతీయుడు 2’ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా దాదాపు 22ఏళ్ల క్రితం రూపొందిన ‘భారతీయుడు’కి ఇది సీక్వెల్‌. ఈ సినిమా షూటింగ్‌ డిసెంబర్లో మొదలవుతుంది. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తారు. అజయ్‌ దేవగణ్‌ విలన్‌గా నటిస్తారన్న ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం తర్వాత శంకర్‌ మరో సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా చేయబోతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top