కొత్త కథల్ని ఆదరిస్తున్నారు

K.S RamaRao Speech At Vaikuntapali Movie Audio Launch - Sakshi

‘‘వైకుంఠపాళి’ చిత్ర నిర్మాత ఆదినారాయణకు సినిమాలంటే ప్యాషన్‌. ఆయన ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. ఈ సినిమా టైటిల్, ట్రైలర్‌ కొత్తగా ఉన్నాయి. ప్రేక్షకులు కొత్త కథలను ఆదరిస్తోన్న ఈ తరుణంలో ఈ సినిమా కూడా సక్సెస్‌ సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని ప్రముఖ నిర్మాత కె.యస్‌. రామారావు అన్నారు. సాయికేతన్, మేరి జంటగా అజ్గర్‌ అలీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం   ‘వైకుంఠపాళి’. ఎస్‌కెఎమ్‌యల్‌ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తోన్న ఈ సినిమా పాటలను కె.యస్‌. రామారావు విడుదల చేశారు.

దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ– ‘‘వైకుంఠపాళి’ అందరికీ బాగా తెలిసిన ఆట. అలాంటి గేమ్‌తో హారర్‌ సినిమా  చేయడం మంచి ఆలోచన. కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకు  మంచి ఆదరణ లభిస్తోన్న ఈ సమయంలో ఇలాంటి ప్రయత్నం చేసిన దర్శక–నిర్మాతలకు అభినందనలు’’ అన్నారు. ‘‘ఓ కొత్త పాయింట్‌తో తీసిన చిత్రమిది. అందరికీ నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నాం. ఆదినారాయణగారిలాంటి నిర్మాతలు ఉంటే సినిమా విడుదల కోసం కష్టపడాల్సిన పనేలేదు’’ అన్నారు అజ్గర్‌ అలీ.

‘‘మంచి కథ ఉంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడకుండా థియేటర్స్‌ ఇస్తున్నారు. మా సినిమా బిజినెస్‌ ఇప్పటికే పూర్తి అయింది. త్వరలో సినిమాని విడుదల చేస్తున్నాం. మా బ్యానర్‌లో ప్రొడక్షన్‌ నెంబర్‌ 5గా  హరీష్‌ కుమార్‌ ముక్కి దర్శకత్వంలో ‘మిస్టర్‌ లోన్లీ’ (‘వీడి చుట్టూ అమ్మాయిలే’ అన్నది ఉపశీర్షిక) షూటింగ్‌ త్వరలో ప్రారంభించబోతున్నాం’’ అన్నారు కాండ్రేగుల ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీరశంకర్, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సురేష్‌ కొండేటి,  సాయి వెంకట్, సంగీత దర్శకుడు ప్రమోద్, సాయి కేతన్, హీరోయిన్స్‌ ప్రియా వల్లభి, నీలమ్‌ నైనా తదితరులు పాల్గొన్నారు. ‘‘వైకుంఠపాళి’ చిత్ర నిర్మాత ఆదినారాయణకు సినిమాలంటే ప్యాషన్‌. ఆయన ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి.

ఈ సినిమా టైటిల్, ట్రైలర్‌ కొత్తగా ఉన్నాయి. ప్రేక్షకులు కొత్త కథలను ఆదరిస్తోన్న ఈ తరుణంలో ఈ సినిమా కూడా సక్సెస్‌ సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని ప్రముఖ నిర్మాత కె.యస్‌. రామారావు అన్నారు. సాయికేతన్, మేరి జంటగా అజ్గర్‌ అలీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం   ‘వైకుంఠపాళి’. ఎస్‌కెఎమ్‌యల్‌ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తోన్న ఈ సినిమా పాటలను కె.యస్‌. రామారావు విడుదల చేశారు. దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ– ‘‘వైకుంఠపాళి’ అందరికీ బాగా తెలిసిన ఆట. అలాంటి గేమ్‌తో హారర్‌ సినిమా  చేయడం మంచి ఆలోచన. కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకు  మంచి ఆదరణ లభిస్తోన్న ఈ సమయంలో ఇలాంటి ప్రయత్నం చేసిన దర్శక–నిర్మాతలకు అభినందనలు’’ అన్నారు.

‘‘ఓ కొత్త పాయింట్‌తో తీసిన చిత్రమిది. అందరికీ నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నాం. ఆదినారాయణగారిలాంటి నిర్మాతలు ఉంటే సినిమా విడుదల కోసం కష్టపడాల్సిన పనేలేదు’’ అన్నారు అజ్గర్‌ అలీ. ‘‘మంచి కథ ఉంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడకుండా థియేటర్స్‌ ఇస్తున్నారు. మా సినిమా బిజినెస్‌ ఇప్పటికే పూర్తి అయింది. త్వరలో సినిమాని విడుదల చేస్తున్నాం. మా బ్యానర్‌లో ప్రొడక్షన్‌ నెంబర్‌ 5గా  హరీష్‌ కుమార్‌ ముక్కి దర్శకత్వంలో ‘మిస్టర్‌ లోన్లీ’ (‘వీడి చుట్టూ అమ్మాయిలే’ అన్నది ఉపశీర్షిక) షూటింగ్‌ త్వరలో ప్రారంభించబోతున్నాం’’ అన్నారు కాండ్రేగుల ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీరశంకర్, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సురేష్‌ కొండేటి,  సాయి వెంకట్, సంగీత దర్శకుడు ప్రమోద్, సాయి కేతన్, హీరోయిన్స్‌ ప్రియా వల్లభి, నీలమ్‌ నైనా తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top