చూడలేని ప్రేమ

krishna thulasi movie songs launch - Sakshi

సంచారి విజయ్‌ కుమార్, మేఘా శ్రీ జంటగా ఎస్‌ఏఆర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణ తులసి’. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ సినిమాని అన్నపూర్ణేశ్వరి సినీ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీ ఉషోదయ క్రియేషన్స్‌ సహకారంతో   యం. నారాయణ స్వామి, నాగలక్ష్మిలు తెలుగులో ‘తులసి కృష్ణ’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా పాటల సీడీని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసి, మొదటి సీడీని  డైరెక్టర్‌ సాగర్‌కి అందజేశారు.

ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘లవ్‌ అట్‌ ఫస్ట్‌ సైట్‌ అనుకునే ఈ రోజుల్లో అంధుడైన హీరో, అందమైన యువతి మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుందో డైరెక్టర్‌ అద్భుతంగా చూపించాడు’’ అన్నారు. ‘‘కనులతో ప్రేమించే ప్రేమకన్నా మనసుతో ప్రేమించే ప్రేమ గొప్పది’’ అన్నారు డైరెక్టర్‌ సాగర్‌. ‘‘కథా బలమున్న చిత్రాలను  తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. కన్నడలో కంటే తెలుగులో గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని ఎస్‌ఏఆర్‌ అన్నారు. ‘‘మంచి సినిమాను  తెలుగు ప్రేక్షకులకు అందించాలని ‘తులసి కృష్ణ’ చిత్రాన్ని ఇక్కడ విడుదల చేస్తున్నాం’’ అన్నారు సహనిర్మాత డాక్టర్‌ మహేంద్ర. నిర్మాతలు సాయివెంకట్, మోహన్‌గౌడ్‌ మాట్లాడారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top