కంటతడి పెట్టిస్తున్న చిరంజీవి పాట | Khaidi No 150, Neeru Neeru song Released | Sakshi
Sakshi News home page

కంటతడి పెట్టిస్తున్న చిరంజీవి పాట

Jan 4 2017 6:45 PM | Updated on Sep 5 2017 12:24 AM

కంటతడి పెట్టిస్తున్న చిరంజీవి పాట

కంటతడి పెట్టిస్తున్న చిరంజీవి పాట

మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నంబర్‌150' చిత్రంలోని మరో పాటను యూట్యూబ్‌ లో బుధవారం విడుదల చేశారు.

మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నంబర్‌150' చిత్రంలోని మరో పాటను యూట్యూబ్‌ లో బుధవారం విడుదల చేశారు. రైతుల కష్టాల నేపథ్యంలో ఈ పాట వస్తుంది. అన్నదాతల ఆక్రందనలను ఆర్థ్రంగా పలికించిన ఈ పాట అభిమానులను కంటతడి పెట్టిస్తోంది. ఈ పాటను తమను ఎంతోగానో కదిలించిందని అభిమానులు పేర్కొన్నారు.

నీరు.. నీరు..
రైతు కంట నీరు
చూడనైన చూడరెవ్వరూ
గుండెలన్ని బీడు
ఆశలన్ని మోడు
’  అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. శంకర్‌ మహదేవన్‌ ఆలపించగా, దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూర్చారు. ఇంతకుముందు విడుదల చేసిన పాటలకు కూడా  అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నెల 7న ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గుంటూరులోని హాయ్లాండ్లో నిర్వహించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న 'ఖైదీ నెం.150' సినిమాను విడుదల చేయనున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement