ఎరుపు రంగు జుట్టు...అబ్బో ఎబ్బెట్టు! | Katrina Kaif's 'red hair' look slammed | Sakshi
Sakshi News home page

ఎరుపు రంగు జుట్టు...అబ్బో ఎబ్బెట్టు!

May 17 2015 11:34 PM | Updated on Apr 4 2019 5:42 PM

ఎరుపు రంగు జుట్టు...అబ్బో ఎబ్బెట్టు! - Sakshi

ఎరుపు రంగు జుట్టు...అబ్బో ఎబ్బెట్టు!

కత్రినా కైఫ్ పరువు మొత్తం కాన్స్ గంగపాలు అని బాలీవుడ్‌లో మాట్లాడుకుంటున్నారు. విషయం ఏంటంటే...

 కత్రినా కైఫ్ పరువు మొత్తం కాన్స్ గంగపాలు అని బాలీవుడ్‌లో మాట్లాడుకుంటున్నారు. విషయం ఏంటంటే... ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఎర్ర తివాచీపై ఈ బ్యూటీ ఏ రేంజ్‌లో తళుక్కుమంటారోనని చాలామంది ఆసక్తిగా ఎదురు చూశారు. మొదటి రోజు నలుపు రంగు పొడవాటి గౌను, రెండో రోజు ఎరుపు రంగు గౌనుతో ఎర్రతివాచీపై కత్రినా ప్రత్యక్షమయ్యారు. వీక్షకులను పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయారామె. పైగా, విమర్శల పాలయ్యారు. ఆ రెండు రోజులూ కత్రినా ఎరుపు జుట్టుతో కనిపించారు. దాంతో, ‘‘అసలా రంగేంటి? లుక్ మరీ ఓల్డ్‌గా ఉంది’’ అని విదేశీయులు విమర్శించేశారు. కానీ, కత్రినా అదేం పట్టించుకోలేదు. ప్రస్తుతం నటిస్తున్న ‘ిఫిటూర్’లోని పాత్ర కోసమే ఆమె ఎరుపు రంగు వేయించుకున్నారట. కాన్స్‌కి కూడా అలానే వెళ్లిపోయారు.
 

Advertisement
 
Advertisement
Advertisement