మా ఆయన కూతురు మంచినటి అవుతుంది | Kareena says, Sara is going to make a wonderful actor | Sakshi
Sakshi News home page

మా ఆయన కూతురు మంచినటి అవుతుంది

Jun 17 2016 3:34 PM | Updated on Apr 3 2019 6:34 PM

మా ఆయన కూతురు మంచినటి అవుతుంది - Sakshi

మా ఆయన కూతురు మంచినటి అవుతుంది

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ముద్దుల తనయ సారా అలీఖాన్ బాలీవుడ్లో తెరంగేట్రం చేయడానికి రెడీ అయ్యింది.

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ముద్దుల తనయ సారా అలీఖాన్ బాలీవుడ్లో తెరంగేట్రం చేయడానికి రెడీ అయ్యింది. న్యూయార్క్లోని కొలంబియా యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సారా ఇటీవల ముంబైకి తిరిగొచ్చింది. మోహిత్ సూరి సినిమాలో ఆమె నటించనుంది. సారా తెరంగేట్రంపై సవతి తల్లి, సైఫ్ అలీఖాన్ రెండో భార్య, నటి కరీనా కపూర్ స్పందిస్తూ.. ఆమె మంచి నటి అవుతుందని చెప్పింది. తెరపై సారాను చూడాలని ఉత్సుకతో ఉన్నట్టు కరీనా చెప్పింది.

'సారా చాలా అందమైనదే కాదు తెలివైనది కూడా. అంతేగాక ఆమె చాలా ధైర్యవంతురాలు. సారా గొప్ప నటి అవుతుందనే నమ్మకముంది. తెరపై ఆమె నటనను చూడాలని నేను, సైఫ్ ఎదురుచూస్తున్నాం' అని కరీనా చెప్పింది. సారా సినిమాలను కెరీర్గా ఎంచుకోవడాన్ని ఆమె తండ్రి సైఫ్ అలీఖాన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తన కూతురికి ఇష్టమైన దారిలో వెళ్లడాన్ని సమర్థిస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సారా.. సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్ల కూతురు.

సారా తొలి చిత్రంలో కరీనా కపూర్కు వరుసకు సోదరుడయ్యే ఇషాన్ ఖట్టర్ సరసన నటించనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా పనులు ప్రారంభంకానున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement