breaking news
Saif Ali Khan daughter
-
మా ఆయన కూతురు మంచినటి అవుతుంది
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ముద్దుల తనయ సారా అలీఖాన్ బాలీవుడ్లో తెరంగేట్రం చేయడానికి రెడీ అయ్యింది. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సారా ఇటీవల ముంబైకి తిరిగొచ్చింది. మోహిత్ సూరి సినిమాలో ఆమె నటించనుంది. సారా తెరంగేట్రంపై సవతి తల్లి, సైఫ్ అలీఖాన్ రెండో భార్య, నటి కరీనా కపూర్ స్పందిస్తూ.. ఆమె మంచి నటి అవుతుందని చెప్పింది. తెరపై సారాను చూడాలని ఉత్సుకతో ఉన్నట్టు కరీనా చెప్పింది. 'సారా చాలా అందమైనదే కాదు తెలివైనది కూడా. అంతేగాక ఆమె చాలా ధైర్యవంతురాలు. సారా గొప్ప నటి అవుతుందనే నమ్మకముంది. తెరపై ఆమె నటనను చూడాలని నేను, సైఫ్ ఎదురుచూస్తున్నాం' అని కరీనా చెప్పింది. సారా సినిమాలను కెరీర్‌గా ఎంచుకోవడాన్ని ఆమె తండ్రి సైఫ్ అలీఖాన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తన కూతురికి ఇష్టమైన దారిలో వెళ్లడాన్ని సమర్థిస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సారా.. సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్‌ల కూతురు. సారా తొలి చిత్రంలో కరీనా కపూర్‌కు వరుసకు సోదరుడయ్యే ఇషాన్ ఖట్టర్ సరసన నటించనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా పనులు ప్రారంభంకానున్నట్టు సమాచారం. -
షిండే మనవడితో హీరో కుమార్తె డేటింగ్?
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముద్దుల తనయ సారా అలీ ఖాన్‌కు తెరంగేట్రం చేయకముందే పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సారా తన తండ్రి సైఫ్ బాటలో సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. సారాకు సంబంధించిన ఓ వార్త బాలీవుడ్లో ఇటీవల చక్కర్లు కొడుతోంది. ఓ రాజకీయ నేత మనవడితో సారా డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియాతో ఈ బ్యూటీకి రిలేషన్ ఉన్నట్టు వార్తలు వెలువడ్డాయి. వీర్ దుబాయ్‌లో చదువుకున్నాడు. పాప్ సింగర్‌గా కెరీర్ ప్రారంభించాలని అతను భావిస్తున్నట్టు సమాచారం. సైఫ్, అతడి మొదటి భార్య అమృతా సింగ్‌కు కుమార్తె సారాతో పాటు కొడుకు ఇబ్రహీమ్ అలీఖాన్ సంతానం. అమృతతో విడిపోయిన సైఫ్.. బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.