మీడియా నేపథ్యంలో... | kapali movie teaser released | Sakshi
Sakshi News home page

మీడియా నేపథ్యంలో...

Oct 4 2016 10:59 PM | Updated on Sep 4 2017 4:09 PM

మీడియా నేపథ్యంలో...

మీడియా నేపథ్యంలో...

ఇప్పటి వరకూ జర్నలిజం ప్రధానాంశంగా పలు చిత్రాలొచ్చాయి. కానీ, మా ‘కాపాళి’ వాటికి భిన్నంగా ఉంటుంది.

‘‘ఇప్పటి వరకూ జర్నలిజం ప్రధానాంశంగా పలు చిత్రాలొచ్చాయి. కానీ, మా ‘కాపాళి’ వాటికి భిన్నంగా ఉంటుంది. జర్నలిస్టులు నిజ జీవితంలో ప్రాణాలు పణంగా పెట్టి ఎలా కష్టపడుతున్నారో కళ్లకు కట్టినట్టు చూపించాం’’ అని దర్శక-నిర్మాత మేసా రాజేశ్ అన్నారు. ఆయన లీడ్ రోల్‌లో నటించి, రోహిణ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ‘కాపాళి’ టీజర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.

రాజేశ్ మాట్లాడుతూ-‘‘తనకు అప్పగించిన ఓ పనిని ఫౌండ్ పుటేజ్ ఆధారంగా ఓ జర్నలిస్ట్ ఎలా పూర్తి చేశాడన్నదే కథ. థ్రిల్లర్, సస్పెన్స్ మూవీ. నాలుగు కథలు ఒకేసారి జరుగుతుంటాయి. మా చిత్రం తరహా కై్లమాక్స్ ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ రాలేదు. అన్నివర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement