'అర్జున్ రెడ్డి'తో పార్టీ బ్యూటీ | kannada heroine Rashmika in vijay devarakonda Next | Sakshi
Sakshi News home page

'అర్జున్ రెడ్డి'తో పార్టీ బ్యూటీ

Sep 6 2017 3:20 PM | Updated on Sep 17 2017 6:29 PM

'అర్జున్ రెడ్డి'తో పార్టీ బ్యూటీ

'అర్జున్ రెడ్డి'తో పార్టీ బ్యూటీ

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ హాట్ ఫేవరెట్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ స్టార్ ప్రొడక్షన్స్ తో

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ హాట్ ఫేవరెట్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ స్టార్ ప్రొడక్షన్స్ తో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం అర్జున్ రెడ్డి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ యంగ్ హీరో త్వరలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో సినిమా చేయనున్నారు. అదే బ్యానర్ లో శ్రీరస్తు శుభమస్తు లాంటి డీసెంట్ హిట్ ఇచ్చిన పరుశురాం ఈ సినిమాను దర్శకత్వం వహిస్తున్నారు.

ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠిని తీసుకోవాలని భావించారు. అయితే లావణ్య డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవటంతో ఇప్పుడు మరో హీరోయిన్ ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. సాండల్ వుడ్ లో కిరిక్ పార్టీ సినిమాతో స్టార్ ఇమేజ్ అందుకున్న రష్మిక, విజయ్ సరసన హీరోయిన్ గా నటించనుందట. ఇద్దరు ఒక్క సినిమాతో సెనేషనల్ గా మారిన స్టార్స్ కావటంతో ఈ కాంబినేషన్ పై ఆసక్తి నెలకొంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement