రేపే మెగా అల్లుడి ‘విజేత’ టీజర్‌ 

Kalyaan Dhev Vijetha Movie Teaser Will Be Released On 12th June - Sakshi

మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. మెగా సపోర్ట్‌తో ఎంట్రీ ఇచ్చినా.. తమకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నారు మెగా హీరోలు. ఈ నేపథ్యంలో చిరు చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. త్వరలోనే ‘విజేత’గా మన ముందుకు రాబోతున్నారు. ఇటీవలె విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. 

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రేపు (జూన్‌ 12)న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ నెల 24న జరిగే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిధిగా రాబోతున్నట్లు ప్రకటించారు. మెగాస్టార్‌ మాత్రమే కాక మిగతా మెగా హీరోలందరూ హాజరు కాబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ హీరోకు మెగా ఫ్యామిలీ సపోర్ట్‌ గట్టిగానే ఉండబోతోందని తెలుస్తోంది.

కళ్యాణ్‌ దేవ్‌కు జోడిగా మాళవికా నాయర్‌ నటిస్తోంది. రాకేశ్‌ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లో ఓ మైలురాయి చిత్రమైన విజేత సినిమా టైటిల్‌ను ఈ సినిమాకు పెట్టడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా విజయవంతమై కళ్యాణ్‌ దేవ్‌ను బాక్సాఫీస్‌ వద్ద విజేతగా నిలబెడుతుందో లేదో వేచి చూడాలి.  ఈ సినిమాకు సినిమాటోగ్రఫర్‌ : సెంథిల్‌కుమార్‌, నిర్మాత : రజనీ కొర్రపాటి, మ్యూజిక్‌ : హర్షవర్థన్‌ రామేశ్వర్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top