దెయ్యంతో ఉప్పిగంతులు! | Kalpana 3 Movie Audio Launch | Sakshi
Sakshi News home page

దెయ్యంతో ఉప్పిగంతులు!

May 10 2017 11:11 PM | Updated on Sep 5 2017 10:51 AM

దెయ్యంతో ఉప్పిగంతులు!

దెయ్యంతో ఉప్పిగంతులు!

ఉపేంద్ర, ప్రియమణి, తులసి ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘కల్పన 3’. ఉదయ్‌రాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కన్నడలో ఘనవిజయం సాధించింది.

ఉపేంద్ర, ప్రియమణి, తులసి ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘కల్పన 3’. ఉదయ్‌రాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కన్నడలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

అర్జున్‌ జన్య స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని తమిళనాడు మాజీ గవర్నర్‌ కె. రోశయ్య విడుదల చేశారు. ‘‘ఈ చిత్రాన్ని తమిళంలో రాఘవ లారెన్స్, కన్నడంలో ఉపేంద్ర చేశారు. నేను తీసిన దెయ్యం సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. ఈ చిత్రం కూడా హిట్‌ అవుతుందనే భరోసా ఉంది’’ అని రామసత్యనారాయణ అన్నారు. సమర్పణ: సాయి వెంకట్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement