కొత్తగా... సరికొత్తగా!

Kajal Aggarwal and Dulquer Salmaan to team up - Sakshi

నూతన దశాబ్దం మొదలైంది. ఈ కొత్త దశాబ్దంలో సరికొత్తగా ఉండాలనుకుంటున్నారు కాజల్‌. ఉండాలనుకోవడమే కాదు.. ఆ దిశగా ప్రయాణం కూడా చేస్తున్నాను అంటున్నారామె. ‘‘కొత్త దశాబ్దంలో ఎవ్వరైనా ఇంకా కొత్తగా ఎలా పని చేయగలం అని ఆలోచిస్తారు. నేను కూడా అంతే. ప్రస్తుతం నేను విభిన్నమైన స్క్రిప్ట్స్‌ను ఎంచుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ కొత్త కొత్త ఐడియాలు, స్క్రిప్ట్స్‌తో సినిమాలు చేస్తున్నాను. ఈ దశాబ్దంలోనే వెబ్‌ ప్రపంచంలో ఓ షో చేయబోతున్నాను.

సీనియర్‌ యాక్టర్స్‌తో పాటు జూనియర్స్‌తోనూ యాక్ట్‌ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఈ దశాబ్దం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉండబోతోందని అనుకుంటున్నాను’’ అన్నారు కాజల్‌. ప్రస్తుతం ఆమె కమల్‌హాసన్‌ తో ‘ఇండియన్‌2’, జాన్‌ అబ్రహామ్‌తో ‘ముంబై సాగా’ సినిమాలు చేస్తున్నారామె. తాజాగా దుల్కర్‌ సల్మాన్‌ తో ఓ తమిళ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు డ్యాన్స్‌ మాస్టర్‌  బందా దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఇది కాకుండా కాజల్‌ ఓ తమిళ వెబ్‌ సిరీస్‌ చేయబోతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top