
నచ్చినోడు ఎదుట పడితే ప్రేమించేస్తా
నేను చాలా సులభంగా ప్రేమలో పడిపోతాను అంటోంది నటి కాజల్‌అగర్వాల్. ఈ మగువ అనుకువ గురించి పక్కన పెడదాం.
నేను చాలా సులభంగా ప్రేమలో పడిపోతాను అంటోంది నటి కాజల్‌అగర్వాల్. ఈ మగువ అనుకువ గురించి పక్కన పెడదాం. ఎందుకంటే దాని గురించి అంతగా తెలియదు కాబట్టి. ఇక అందం విషయానికొస్తే కాజల్ అపరంజి బొమ్మనే చెప్పాలి. ఆమె ఒక్క ఓర చూపు చూస్తే చాలు యువత గుండెల్లో అలజడి మొదలవుతుంది. అలాంటి కాజల్‌అగర్వాల్ పెళ్లి చేసుకుంటే ఆమెను ఆరాధించే ప్రేమదాసుల గతేంకాను.
అయినా నచ్చినోడు తారస పడితే ప్రేమించేసి, పెళ్లాడేస్తానంటోందీ బ్యూటీ. ఆ కథేంటో చూద్దాం. నాకు వంట పాక శాస్త్రం తెలుసు. నిజం చెప్పాలంటే నేనొక భోజన ప్రియురాలిని. ఇక ఐస్‌క్రీమ్, కేక్‌లంటే వెనుకాముందు ఆలోచించకుండా లాగించేస్తా. నాకు కేక్ తయారు చేయడం కూడా తెలుసు. ఒకప్పుడు మాంసాకారం ఇష్టంగా తినేదాన్ని. ఇప్పుడు శాఖాహారిగా మారిపోయాను. అయితే గుడ్డు అంటే చాలా ఇష్టం. ఇంట్లో వాళ్లు వాటిని తింటుంటే నోరూరిపోతుండడంతో నేనూ గుడ్డును మాత్రం తినడం మానలేక పోతున్నాను.ఇక నాకు ఇష్టమైన అల్పాహారాల్లో ఆప్పమ్, కొబ్బరిపాలు మొదటి స్థానంలో నిలుస్తాయి.
చెన్నై వస్తే మాత్రం ఇడ్లీ సాంబారు, చట్నీ ఇష్టంగా తింటాను. నాకు ప్రయాణాలు అంతే ఎంత ఇష్టమో.అయితే విమానయానం చేసి బోర్ కొట్టేసింది. నేను ప్రకృతిని ప్రేమిస్తాను. ఐరోపా దేశాలలో రోడ్లపై పయనించాలని ఆశగా ఉంది. నేను ప్రేమలో సులభంగా పడిపోతాను. అలాగని ఇంత వరకూ ఎవరినీ ప్రేమించలేదు. నచ్చినోడు ఎదుట పడితే ప్రేమించేస్తా. పెళ్లి కూడా చేసుకుంటానని కాజల్ తన మనసులోని భావాలను బయట పెట్టింది. మూడు పదుల వయసు మీద పడిన ఈ అమ్మడికి ఇంట్లో వరుడి వేట మొదలైందన్నది గమనార్హం.