జంగిల్ బుక్ కు సీక్వెల్ | JUNGLEBOOK Disney confirms 'Jungle Book' sequel | Sakshi
Sakshi News home page

జంగిల్ బుక్ కు సీక్వెల్

Apr 26 2016 3:06 PM | Updated on Sep 3 2017 10:49 PM

ఇటీవల విడుదలైన సాహన ఫాంటసీ చిత్రం జంగిల్ బుక్ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్టు డిస్నీ సంస్థ ప్రకటించింది.

లాస్ ఏంజిల్స్:  ఇటీవల విడుదలై రికార్డుస్థాయిలో కలెక్షన్లు రాబడుతున్న సాహన ఫాంటసీ చిత్రం జంగిల్ బుక్ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్టు డిస్నీ సంస్థ ప్రకటించింది. ఈ సినిమాను క్రుయెల్లా, 101 డాల్మేషన్స్ స్టూడియోల్లో తీయాలని నిర్ధారించుకున్నారు. ఏంజలీనా జోలీతో మేల్ ఫిసెంట్ సినిమా తీసిన  లిండా వూల్వెర్టాన్ కి ఈ సీక్వెల్  స్రిప్ట్ పని అప్పగించినట్టు సమాచారం. సీక్వెల్ కోసం జంగిల్ బుక్ డైరెక్టర్, కథా రచయిత ప్రపంచ టూర్ కు వెళ్లనున్నారు. సీక్వెల్ ను 2019 లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
 
కాగా ఎప్పుడో 1894లో ఒక నవలగా విడుదలైన జంగిల్ బుక్ కథ సారాంశం ఆధారంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం జోడించి జంగిల్ బుక్ ను కన్నులకు కట్టినట్లుగా తీర్చిదిద్దారు. అడవిలో ఓ నల్లపిల్లికి దొరికిన పిల్లాడిని తిరిగి మనుషులతో జత చేసే క్రమంలో భాగంగా చోటుచేసుకున్న పరిణామాలే ఈ జంగిల్ బుక్. ఇందులో మోగ్లీ అనే పిల్లాడి పాత్రలో భారతీయ సంతతికి చెందిన పిల్లాడు నీల్ సేథి నటించాడు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement