అందరూ హ్యాపీ | Janatha Garage Movie Press Meet | Sakshi
Sakshi News home page

అందరూ హ్యాపీ

Sep 2 2016 11:06 PM | Updated on Sep 4 2017 12:01 PM

అందరూ హ్యాపీ

అందరూ హ్యాపీ

నా దృష్టిలో బ్లాక్ బస్టర్ హిట్ కాదిది, ఓ క్లాసిక్ మూవీ. ఎందుకంటే.. అభిమానులకు నచ్చడం వేరు, ప్రేక్షకులకు నచ్చడం వేరు.

‘‘నా దృష్టిలో బ్లాక్ బస్టర్ హిట్ కాదిది, ఓ క్లాసిక్ మూవీ. ఎందుకంటే.. అభిమానులకు నచ్చడం వేరు, ప్రేక్షకులకు నచ్చడం వేరు. ‘జనతా గ్యారేజ్’ అన్ని వర్గాలకూ నచ్చింది. ఎన్టీఆర్, మోహన్‌లాల్ ఉన్న ఒక్క ఫ్రేమ్ మిస్సవ్వడానికి కూడా ప్రేక్షకులు ఇష్టపడడం లేదు’’ అని దర్శకుడు కొరటాల శివ అన్నారు. ఎన్టీఆర్ హీరోగా ఆయన దర్శకత్వంలో ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సీవీ మోహన్ నిర్మించిన చిత్రం ‘జనతా గ్యారేజ్’. గురువారం విడుదలైన ఈ చిత్రానికి అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన లభిస్తోందని నిర్మాతలు తెలిపారు.
 
  శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో కొరటాల శివ మాట్లాడుతూ - ‘‘ఈ విజయం నాపై మరింత బాధ్యత పెంచింది. కమర్షియల్ ఫార్మాట్‌లో మంచి సందేశాత్మక చిత్రం తీశాను. భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రానికి అంతే భారీ స్పందన వస్తుందని ఊహించలేదు. మొదట ప్రేక్షకుల స్పందన చూసి షాకయ్యాను. మైత్రిలో సెకండ్ బ్లాక్‌బస్టర్, నాకు హ్యాట్రిక్. నిజాయితీగా చెప్పాలంటే.. నా కెరీర్‌లో బెస్ట్ మూవీ.
 
  ఇండస్ట్రీలో స్నేహితులు, హీరోలు, నిర్మాతలు, ప్రేక్షకులు ఫోన్ చేసి అభినందించారు. మలయాళంలో మోహన్‌లాల్‌గారి బెస్ట్ సినిమా అంటున్నారట’’ అన్నారు. ‘‘ప్రతి ఏరియా నుంచి ఒక్కటే రిపోర్ట్.. మూవీ బ్లాక్‌బస్టర్ అని. వసూళ్లు బాగున్నాయి. పలు ఏరియాల్లో ఫస్ట్‌డే రికార్డు నెలకొల్పింది. మార్నింగ్ డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేశారు. అందరూ హ్యాపీ’’ అని నిర్మాతలలో ఒకరైన నవీన్ చెప్పారు. యలమంచిలి రవిశంకర్, సీవీ మోహన్ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement